Trains: నేటినుంచి మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్‌కు రైళ్ల పొడిగింపు
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:51 AM
సికింద్రాబాద్ స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్‌కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad) స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్‌కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట-సికింద్రాబాద్-సిద్దిపేట(Siddipet-Secunderabad-Siddipet)(77656- 77653- 77654- 77655) రైళ్లు మల్కాజ్‌గిరి స్టేషన్‌కు, పుణే- సికింద్రాబాద్-పుణే (12025- 12026) రైళ్లు హైదరాబాద్ దక్కన్ స్టేషన్‌కు, సికింద్రాబాద్-సిల్చార్ -సికింద్రాబాద్(12513- 12514)రైళ్లు,

సికింద్రాబాద్- దర్భంగా- సికింద్రాబాద్ (17007 - 17008) బైవీక్లీ రైళ్లు చర్లపల్లి టెర్మినల్ వరకు పొడిగిస్తున్నట్టు వివరించారు. అలాగే సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ (12735-12736) ట్రైవీక్లీ రైళ్లు, సికింద్రాబాద్-అగర్తల - సికింద్రాబాద్ (07030-07029) వీక్లీ రైళ్లు, ముజఫర్‌పూర్-సికింద్రాబాద్-ముజఫర్‌పూర్(Muzaffarpur-Secunderabad-Muzaffarpur) (05293-05294)వీక్లీ రైళ్లు, హైదరాబాద్-రాక్సౌల్-సికింద్రాబాద్ (07051-07052) వీక్లీ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ వరకు పొడిగించనున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News