Hyderabad crime: దారుణం.. కన్న బిడ్డను బిల్డింగ్ పై నుంచి పడేసిన తల్లి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:03 AM
మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి బిల్డింగ్‌పై నుంచి పడేసింది. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింనది.
హైదరాబాద్, డిసెంబర్ 16: తల్లి ప్రేమకు మించింది మరొకటి ఉండదంటారు. ఎంతటి కష్టమొచ్చినా తాను పస్తులుండైనా కన్న బిడ్డలను ఆకలితీర్చుతుంది కన్న తల్లి. నవమాసాలు మోసి కన్న బిడ్డ కోసం దేన్నైనా ఎదురిస్తుంది. బిడ్డలకు కష్టమొస్తే తనకు వచ్చినట్లు బాధపడుతుంది తల్లి. కానీ కొంత మంది తల్లులు మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తీసుకొస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో కన్న బిడ్డల పట్ల కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారుల పట్ల కన్న మమకారం మరిచి వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కడుపున పుట్టిన బిడ్డ పట్ల ఓ కన్నతల్లి కర్కషంగా ప్రవర్తించి.. చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే...
నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నకూతురిపై తల్లీ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఏడు సంవత్సరాల చిన్నారి షారోని మేరిని కన్నతల్లి మోనాలిసా మూడో అంతస్తు బిల్డింగ్‌పై నుంచి కిందకు పడేసింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు షారోనిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు కన్నబిడ్డను భవనంపై నుంచి పడేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా కన్న బిడ్డను తల్లి ఇలా కర్కషంగా భవనంపై నుంచి పడేయడం స్థానికంగా సంచలనం రేపింది.
ఇవి కూడా చదవండి...
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
ఐదవ రోజుకు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. నిజాలు బయటకు వచ్చేనా?
Read Latest Telangana News And Telugu News