Share News

PV Express Highway: పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

ABN , Publish Date - Dec 16 , 2025 | 09:48 AM

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మూడు కార్లు పరస్పరం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

PV Express Highway: పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
PV Express Highway

హైదరాబాద్, డిసెంబర్ 16: నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై (PV Express Highway) ఈరోజు (మంగళవారం) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు కార్లు ఒకదానికి ఒకటి పరస్పరం ఢీకొన్నాయి. పిల్లర్ నంబర్ 112 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్‌‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. మూడు కార్లు పరస్పరం ఢీకొనడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


కాగా.. ఈ ప్రమాదంలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ముందు వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే దెబ్బతిన్న వాహనాలను అక్కడి నుంచి తరలించే పనిలో పడ్డారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. పొగమంచు నేపథ్యంలో వాహనాదారులు రోడ్లపై ఎంతో జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.


ఇవి కూడా చదవండి...

జాతీయ హైవేలపై ప్రమాదాల కట్టడికి దేశవ్యాప్తంగా ఏకీకృత నిబంధనలు

గెలిచే పార్టీ మనదే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 10:02 AM