Kommineni Family: సర్పంచ్ పదవి.. వరుసగా ఐదోసారి..
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:08 AM
పాతికేళ్లుగా ఆ గ్రామానిక్చి ఆ దంపతులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో కొమ్మినేని రవీందర్ దంపతులు తాజా సర్పంచ్ ....
దంతాలపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పాతికేళ్లుగా ఆ గ్రామానిక్చి ఆ దంపతులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో కొమ్మినేని రవీందర్ దంపతులు తాజా సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి తమ పట్టు చాటుకున్నారు. కొమ్మినేని రవీందర్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1993లో టీడీపీలో చేరి యతిరాజరావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో 2001లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రవీందర్ తొలిసారి బరిలోకి దిగి 470 ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత 2007లో, 2013లో(భార్య మంజుల),2009లోనూ వారే గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన సతీమణి మంజుల 260 ఓట్ల తేడాతో గెలుపొందారు.