Phone Tapping Case: ఐదవ రోజుకు ప్రభాకర్ రావు కస్టడీ.. నిజాలు బయటకు వచ్చేనా?
ABN , Publish Date - Dec 16 , 2025 | 10:17 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఐదవ రోజు విచారిస్తున్నారు. ఆధారాలను ముందు ఉంచి మరీ ప్రభాకర్‌ను సిట్ ప్రశ్నిస్తోంది.
హైదరాబాద్, డిసెంబర్ 16: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణ ఐదవ రోజు ప్రారంభమైంది. గత నాలుగు రోజులుగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే సిట్‌కు ప్రభాకర్ సహకరించనట్లు తెలుస్తోంది. సిట్ అడుగుతుగున్న ప్రశ్నలకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ మౌనంగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ముందు ఉంచి మరీ ప్రభాకర్ రావును సిట్ విచారిస్తోంది. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాలపైనా ఆరా తీస్తోంది.
అయితే.. సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించకపోగా.. చేసిన తప్పులను తన ఉన్నతాధికారులపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలుస్తోంది. పలు డిజిటల్ ఆధారాలు ముందు ఉంచి విచారిస్తున్నా కూడా ప్రభాకర్ రావు నుంచి మౌనమే సమాధానంగా నిలిచింది. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల వివరాలపై ప్రభాకర్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమచారం.
ఐ క్లౌడ్ ఖాతాతో అమెరికాలో లాగిన్ చేసినట్లు గుర్తించిన సిట్.. అక్కడ ఎందుకు లాగిన్ అయ్యారనే దానిపై వివరాలు రాబడుతోంది. అమెరికాలో లాగిన్ అయిన డివైస్‌ను అక్కడే ఎందుకు వదిలేసి వచ్చారన్న దానిపై ప్రభాకర్ రావు నోరు మెదపని పరిస్థితి. మరోవైపు ఎల్లుండితో ప్రభాకర్ కస్టడీ విచారణ ముగియనుంది. దీంతో ఈ రెండు రోజుల్లో ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు ఎలాంటి సమాచారాన్ని రాబడుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
Read Latest Telangana News And Telugu News