Alwal Morphing Photos : యువతి ఫోటోలు మార్ఫింగ్.. రూ.10 లక్షలు డిమాండ్
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:00 PM
ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్‌లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
హైదరాబాద్: ప్రపంచం ఆధునిక సాంకేతికతతో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో.. కొంతమంది దాన్ని ఉపాయోగించుకుని దారుణాలకు, అక్రమాలకు, అన్యాయాలకు ఒడిగడుతున్నారు. మంచి కోసం ఉపాయోగించాల్సిన సాంకేతికతను తమ స్వలాభం కోసం వినియోగిస్తూ.. దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది, అమ్యాయిల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వడం కుదరదు అన్న వారికి ఎదురుతిరిగిన వాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. అమ్యాయిల మరణాలకు కారణం అవుతున్నారు. ఇలాంటి దారుణ ఘటనే.. అల్వాల్ పరిధిలో వెలుగు చూసింది.
నిత్యపెళ్లి కొడుకు బాగోతం..
ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్‌లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. గతంలో ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికొడుకు రవి అలియాస్ రఫీ అతడి సోదరుడు రూపేష్ యువతి ఆడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు.
రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు..
అయితే.. రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేసినట్లు బాధిత యువతి తెలిపింది. వాళ్ల వేధింపులు తాళలేక రూపేష్, రవిపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. కొద్దిరోజుల క్రితమే.. రవిపై నిత్య పెళ్లికొడుకు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. యువతి ఫోటోలు, ఆడియోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నా.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అసలు కథ..
అల్వాల్‌లో స్థానికంగా ఉంటున్న ఓ యువతి దగ్గరలో ఉన్న ఓ జిమ్‌కు రోజూ వెళుతుండేది. ఈ నేపథ్యంలో జిమ్‌లో రవి పరిచయం అయ్యాడు. ఆ తరువాత యువతితో రోజు మాట్లాడుతూ.. పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత యువతి పోటోలు సేకరించి.. వాటిని మార్ఫింగ్ చేసి యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే.. మార్ఫింగ్ చేసిన ఆడియో, ఫోటోలను ఇప్పటికే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాగా, గతంలో కూడా కట్నం కోసం పలు పెళ్లిళ్లు చేసుకుని, వారిని మోసం చేసినట్లు స్థానికంగా రవిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు