Share News

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:59 PM

కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్..  మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!
Bhatti Vikramarka

ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) ఎర్రుపాలెంలో అమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.


అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ఎదగాలి..

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు. జూన్ 2వ తేదీ నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రతి బిడ్డకు ఉచితంగా మెరుగైన విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుడతామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి..

మధిర నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో చివరి భూములకు సాగునీరు అందించాలన్నదే తన సంకల్పమని తెలిపారు. రూ.36 కోట్లతో కట్టలేరు కాలువల మరమ్మతులను చేపట్టామని అన్నారు. ఎన్నెస్పీ కెనాల్ మూడవ జోన్ పరిధిలో ఉన్న భూములను రెండవ జోన్ కిందకు తీసుకువచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందజేస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్ట్‌ను గాలికొదిలేశారని ఆరోపించారు.


సీతారామకు నిధులు కేటాయించాం..

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీతారామకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకువస్తున్నామని.. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందన్నారు. మధిర నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. కట్టలేరు ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 04:23 PM