తెలంగాణలో కాంగ్రెస్‌కు 90 సీట్లు ఎలా వస్తాయ్..?.. రేవంత్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:42 PM
తెలంగాణలో కాంగ్రెస్‌కు 90 సీట్లు ఎలా వస్తాయని.. సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో హామీలు అమలు చేసినందుకు హస్తం పార్టీకి 90 సీట్లు వస్తాయా..? అని నిలదీశారు.
కరీంనగర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌కు 90 సీట్లు ఎలా వస్తాయని.. సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ప్రశ్నించారు. రాష్ట్రంలో హామీలు అమలు చేసినందుకు హస్తం పార్టీకి 90 సీట్లు వస్తాయా..? అని నిలదీశారు. ఈరోజు (సోమవారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఇచ్చారా..?, రూ.2500 మహిళలకు ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
దేశద్రోహుల ఓట్లను తొలగించడం తప్పా..?
తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తామని ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ‘సర్’ విషయంలో కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అనవసరపు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన వారి ఓట్లు తీసేస్తే తప్పా..? అని ప్రశ్నించారు. దేశద్రోహుల ఓట్లను తొలగించడం తప్పా..? అని నిలదీశారు. ప్రధానిని ప్రజలే నిర్ణయించాలని తెలిపారు. యుద్ధం ప్రారంభమైందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది: రామచందర్ రావు
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, ప్రాంతాల పేరుతో అరాచకాలను హస్తం పార్టీ సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. ‘సర్’ ప్రక్రియ కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని ప్రస్తావించారు. దేశంలో మోదీ ఎన్నిక చెల్లకపోతే.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఎన్నిక ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని రామచందర్ రావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News