Share News

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:40 AM

తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున
Akkineni Nagarjuna

హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు (శుక్రవారం) నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రసంగించారు. తనకు ఓ బ్యాంక్ అధికారి పేరుతో గతంలో కాల్ వచ్చిందని తెలిపారు.


ఆ కాల్ నిజమని నమ్మా..

‘నాగార్జున గారు.. మీరు బిజినెస్‌లో చాలా స్మార్ట్ అని విన్నాను.. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు. చాలా గొప్ప లాభాలు ఇచ్చే స్కీమ్ ఇదని ఆ వ్యక్తి నన్ను మాయ చేశాడు’ అని తెలిపారు. సాధారణంగా తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకుంటారని చెప్పారు. కానీ.. నేరుగా తనకు కాల్ చేసే సరికి నిజమని నమ్మానని నాగార్జున అన్నారు.

ఇరాన్‌లోనూ మోసం చేయబోయి..

అలాగే, ఇరాన్‌లో జరిగిన మరో విషయం గురించి నాగార్జున ప్రస్తావించారు. ‘నా బంధువు ఒకరు షూటింగ్ కోసం ఇరాన్ వెళ్లినప్పుడు... ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే మాకు ఓ వీడియో కాల్ వచ్చింది. మేము పోలీసులమని.. మీ బ్యాగేజ్‌లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. మీ రూమ్ నుంచి కదలవద్దని అంటూ.. ఆ వీడియో కాల్‌లో చెప్పారు. కానీ నాకు ఈ సైబర్ ఫ్రాడ్‌పై అవగాహన ఉండటంతో.. వెంటనే పోలీసులకు కాల్ చేశా’ అని నాగార్జున పేర్కొన్నారు.


ప్రతీ 15 రోజులకు నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తా..

ప్రతీ 15 రోజులకు ఒకసారి తాను తన పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తానని నాగార్జున ప్రస్తావించారు. తన ఫోన్‌లో తాను ఒక్క ఫొటో కూడా తీసుకోనని చెప్పుకొచ్చారు. చాలా అప్రమత్తంగా ఉంటానని తెలిపారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండటం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఇది తెలంగాణ పోలీసుల గొప్పతనమని కొనియాడారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చాలా కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కూడా డీజీపీ ఆనంద్, సీపీ సజ్జనార్ చాలా మేలు చేశారని నాగార్జున పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 01:26 PM