Share News

భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ మోసాలు.. పోలీసుల హెచ్చరిక

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:04 PM

బ్లాక్ ఫ్రైడే, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని టీజీసీఎస్‌బీ అధికారులు అలర్ట్ చేశారు. ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై ప్రజలను హెచ్చరించారు.

భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ మోసాలు.. పోలీసుల హెచ్చరిక
Online Shopping Fraud

హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బ్లాక్ ఫ్రైడే, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని టీజీసీఎస్‌బీ అధికారులు (TGCSB) అలర్ట్ చేశారు. ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై ప్రజలను హెచ్చరించారు. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని వెల్లడించారు. భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేస్తున్నారని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.


SMS, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను అసలు క్లిక్ చేయొద్దని టీజీసీఎస్‌బీ అధికారులు సూచించారు. గుర్తింపు లేని వెబ్‌సైట్లలో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయొద్దని హెచ్చరించారు. OTP, UPI PIN, CVV వంటి బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద QR కోడ్‌లను స్కాన్ చేయొద్దని హెచ్చరించారు. ఆఫర్ల పేరుతో ముందస్తు చెల్లింపులు చేయడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లలోనే ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని టీజీసీఎస్‌బీ అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 06:01 PM