నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:01 AM
బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్, జులై 21 (ఆంధ్రజ్యోతి): బల్కంపేట ఎల్లమ్మ తల్లి (Balkampet Yellamma Temple) దివ్య కల్యాణ మహోత్సవం ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచే వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 11:59 గంటల సుముహూర్తానికి అమ్మవారి కల్యాణాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రులతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు: మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర ప్రజలు శాంతి, సుభిక్షం, ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తులతో కలిసి మంత్రి మొక్కులు చెల్లించారు. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పించిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న సీఎం సతీమణి..
అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఆమెకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News