Share News

కేసీఆర్‌కు నమ్మకం లేకనే హరీశ్‌రావును ఆ పదవి నుంచి తొలగించారు: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:29 PM

మాజీ మంత్రి హరీశ్‌రావుకి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌లో హరీశ్‌రావు నిష్ణాతుడైతే వాళ్ల మామ కేసీఆర్ ఆయనను మొదట్లో మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు నమ్మకం లేకనే హరీశ్‌రావును ఆ పదవి నుంచి తొలగించారు: మంత్రి ఉత్తమ్
Telangana Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, జులై 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావుకి (Harish Rao) మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌లో హరీశ్‌రావు నిష్ణాతుడైతే వాళ్ల మామ కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి మొదట్లో ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఈరోజు (గురువారం) సచివాలయంలో మీడియాతో మంత్రి ఉత్తమ్ చిట్‌చాట్ చేశారు. హరీశ్‌రావుపై కేసీఆర్‌కు నమ్మకం లేకనే మంత్రి పదవి నుంచి తీసేశారని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో వచ్చే వేసవి వరకు రిపేర్లు పూర్తి అవుతాయని తెలిపారు.


బ్యారేజీలో డ్యామేజీల మరమ్మతులు చేయడానికి తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు తనకు మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారని.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చెప్పినట్లుగా హరీశ్‌రావు తమ పార్టీలో చేరుతారా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై సరైన సమయంలో సవివరంగా తాము సమాధానం చెబుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 04:56 PM