యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:40 PM
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పనిముట్లు ఖరారు చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యాంత్రీకరణ సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పనిముట్లు ఖరారు చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. యాంత్రీకరణ సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు (శుక్రవారం) వ్యవసాయశాఖపై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎంప్యానెల్ సంస్థల జాబితాను హాకా అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఆ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి..
యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ యాప్ సమస్యలను.. అదే రోజే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ఫెర్టిలైజర్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కాంప్లెక్స్ ఎరువులకూ సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్నదాతలు యూరియాను అధికంగా వాడే పరిస్థితి మారాలని అన్నారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో వేగం పెంచాలని ఆదేశించారు. రైతులకు 2 నుంచి 3 రోజుల్లోనే ఆయిల్‌పామ్ మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
ఆయిల్‌పామ్ మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలి..
డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు మొక్కల సరఫరాలో ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అన్నారు. లక్ష్యానికి రెండింతల ఆయిల్‌పామ్ మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. 2600 రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. 2 నుంచి 3 నెలల్లో రైతు వేదికలపై సోలార్ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News