భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:52 PM
భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. యుఎస్ నుంచి 'జావెలిన్' యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు ఇరు దేశాల అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
ఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. యుఎస్ నుంచి 'జావెలిన్' యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు ఇరు దేశాల అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు అమెరికా ఫారిన్ మిలిటరీ సేల్స్ (FMS) ప్రక్రియ ద్వారా లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ (LOA)పై భారత అధికారులు సంతకం చేశారు. 'జావెలిన్' డీల్‌తో ఇరుదేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.
భారత్‌లో జావెలిన్ క్షిపణుల సంయుక్త ఉత్పత్తికి మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. క్షిపణులను ప్రయోగించిన తర్వాత మళ్లీ గైడ్ చేయక్కర్లేని 'ఫైర్ అండ్ ఫర్గెట్' ఆటోమేటిక్ టెక్నాలజీతో జావెలిన్ మిస్సైళ్లు పనిచేస్తాయని వివరించారు. శత్రు దేశాల ట్యాంకులు, బంకర్లకు చెక్ పెట్టేలా భయానక 'ఫైర్ అండ్ ఫర్గెట్' టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో శత్రువుల ట్యాంకులు, బంకర్లు, సాయుధ వాహనాలను ధ్వంసం చేయడంలో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News