బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ABN , Publish Date - May 23 , 2026 | 12:18 PM
మాజీమంత్రి హరీశ్‌రావుపై.. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీశ్‌రావు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి హరీశ్‌రావుపై(Harish Rao).. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీశ్‌రావు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పొంగులేటి పోస్టు పెట్టారు. బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఎవరికైనా ఒప్పందాలు చేసుకున్నారా..? అంటూ నిలదీశారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఒక్క మెట్రోస్టేషన్ కూడా ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్‌లు కట్టుకుందని.. కానీ తాము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని ఉద్ఘాటించారు. మూసీప్రక్షాళన, లగచర్ల ఇండస్ట్రీస్‌కు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారని ఆగ్రహించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలను కుట్రలతో అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా తాము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తు ఖతం చేయాలని బీఆర్ఎస్ నేతలే చూస్తున్నారని సెటైర్లు గుప్పించారు. ‘బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్
కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And International News And Telugu News