Share News

కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - May 25 , 2026 | 01:26 PM

కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని పేర్కొన్నారు.

కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ బృందం ఈరోజు (సోమవారం) సచివాలయంలో సమావేశం అయ్యారు.


సీఎంని కలిసిన వారిలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, పశ్య పద్మ , ఈ.నరసింహ, చాడ వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. కార్మికులకు కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి సీపీఐ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎంతో సీపీఐ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులతో సీఎం మాట్లాడారు. కేంద్రప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. తమ ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 01:36 PM