Share News

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

ABN , Publish Date - May 24 , 2026 | 10:08 AM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిన్న(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి షెడ్యూల్ కార్యక్రమాల నిర్వహణ వరకు పలు అంశాల్లో గందరగోళం చోటుచేసుకోవడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.


అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం..

అలాటింగ్ ప్రకారం సీఎం హెలికాప్టర్ ప్రధాన గుట్ట కింద ఉన్న హెలిపాడ్‌లో దిగాల్సి ఉండగా, అనూహ్యంగా దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని పెద్ద గుట్టపై ఉన్న హెలిపాడ్‌లో ల్యాండ్ అయింది. దీంతో సీఎం రాక కోసం ప్రధాన హెలిపాడ్ వద్ద ఎదురుచూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. హెలికాప్టర్ వేరే చోట ల్యాండ్ కావడంతో అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హుటాహుటిన అక్కడికి చేరుకునేందుకు పరుగులు తీశారు. ఈ పరిణామం అధికార యంత్రాంగంలో సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ..

ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. ముఖ్యంగా సీఎస్, డీజీపీ స్థాయిలో ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి కూడా ఉన్నతాధికారులు వివరణ తీసుకుంటున్నారు. హెలికాప్టర్ ఒకచోట దిగాల్సి ఉండగా మరోచోట ల్యాండ్ కావడంపై ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, ఏవియేషన్ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైదరాబాద్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా ఎదగాలి: కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 10:47 AM