CM Revanth Reddy: ‘ఉపాధి’పై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర నిర్ణయం... సీఎం ఫైర్
ABN , Publish Date - Jan 02 , 2026 | 09:05 PM
పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జనవరి2 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకంపై (National Employment Guarantee Scheme) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రం ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ(శుక్రవారం) చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిందని ప్రస్తావించారు. 2006 ఫిబ్రవరి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
62శాతం పేదవారు వెనుకబడిన వర్గాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు.పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రనిర్ణయం ఉందని ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిధుల వాటా 60, 40శాతం మార్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథావిధిగా కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్‌రెడ్డి ఫైర్
నూతన వాహన టాక్స్ విధానం ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
For More TG News And Telugu News