Share News

కూకట్‌పల్లి నల్లచెరువుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:48 PM

కూకట్‌పల్లి నల్లచెరువుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ చెరువును అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధం చేశారు.

 కూకట్‌పల్లి నల్లచెరువుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి నల్లచెరువుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ చెరువును అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధం చేశారు. ఈరోజు(సోమవారం) సాయంత్రం 7 గంటలకు కూకట్‌పల్లి నల్ల చెరువును సీఎం ప్రారంభించనున్నారు. రూ.10 కోట్లతో నల్లచెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు అభివృద్ధి పనులు జరిగాయి. హైడ్రా మొదటి దశలో అభివృద్ధి చేసిన ఆరు చెరువుల్లో ఇది ఒకటి. 2024 సెప్టెంబర్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్లనూ తొలగించింది. చెరువులో వేసిన నిర్మాణ వ్యర్థాలు, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించింది. 16 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును.. మళ్లీ తిరిగి 30 ఎకరాలకు విస్తరించింది.


బోటింగ్ సదుపాయం..

నల్లచెరువులో బోటింగ్ సదుపాయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కల్పించనుంది. హైడ్రా దీనిని అభివృద్ధి చేసిన తర్వాత ఆహ్లాదకరంగా నల్ల చెరువు పరిసరాలు మారాయి. 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్, విశ్రాంతి కోసం సందర్శకులు తరలి వస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు కిడ్స్ ప్లే ఏరియా ఏర్పాటు చేసింది. ఓపెన్ జిమ్‌తో పాటు 1.5 కిలోమీటరు మేర వాక్ వే ఏర్పాటు చేసింది. 7 ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి వరద నీరు చేరేలా చర్యలు చేపట్టింది. చెరువు నిండితే నీరు బయటకు వెళ్లేందుకు పాత ఔట్‌లెట్లను అభివృద్ధి చేసింది. మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జీవ వైవిధ్యం కోసం చెరువులో ఐల్యాండ్స్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 01:00 PM