Share News

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:09 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్
KCR

హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా మహిళాలోకానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉందని వ్యాఖ్యానించారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని వివరించారు. మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు.


ఆకాశంలో సగమై, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషుడుతో సమానమైన అవకాశాలను మరింతగా అందించినప్పుడు మాత్రమే, కుటుంబాభివృద్ధి సంపూర్ణ మవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి ఫరిడవిల్లుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో, అనంతర స్వయం పాలనలో తెలంగాణ మహిళల పాత్ర గొప్పదని వివరించారు. మహిళా సాధికారత దిశగా, వారి సంక్షేమం, ప్రగతికోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 11:13 AM