భారీగా మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Mar 07 , 2026 | 10:55 AM
మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు(శనివారం) పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు.
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు(శనివారం) పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఏకంగా 124 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. దేవ్‌జీకి చెందిన PLGA (Peoples Liberation Guerrilla Army) కమిటీ మొత్తం వారి ఆయుధాలతో.. పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ప్రభుత్వ పునరావాస పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జనజీవన స్రవంతిలో చేరాలనే ఆకాంక్షే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ లొంగుబాటు ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను, వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించే పునరావాస ప్యాకేజీలను సీఎం వివరించనున్నారు. ఒకేసారి 124 మంది మావోయిస్టులు సరెండర్ అవ్వడం రాష్ట్ర పోలీసు చరిత్రలో ఒక రికార్డు అని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ
బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం
Read Latest International News And Telangana News And AP News And Telugu News