Share News

బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:54 AM

హైదరాబాద్‌లోని బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఈ బెదిరింపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.

బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం
Begumpet Bomb Threat

హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇటీవల విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు 'ఫేక్ బాంబ్ బెదిరింపులు' రావడం ఎక్కువైంది. తాజాగా.. హైదరాబాద్‌లోని బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఈ బెదిరింపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపుతో కార్యాలయంలోని సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేంద్రానికి (IMD) గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.


పోలీసుల తనిఖీలు..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్ (Dog Squad), బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) బృందాలు కార్యాలయం అంతటా క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. నిత్యం వాతావరణ సమాచారంతో బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర టెన్షన్‌లో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బందిని కార్యాలయం బయటకు పంపినట్లు సమాచారం.


భయాందోళన చెందవద్దు..

ఇటీవల 'ఫేక్ బాంబ్ బెదిరింపులు' రావడం ఎక్కువైంది. ఇది కూడా అలాంటి ఆకతాయిల పని అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 12:00 PM