Share News

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:42 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన యుద్ధ చర్యలపై అమెరికా కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను డెమోక్రాట్లు నియంత్రించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేపట్టిన యుద్ధ చర్యలపై అమెరికా కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను డెమోక్రాట్లు నియంత్రించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. సెనేట్‌లో డెమోక్రాట్ల తీర్మానం ఓటమి పాలయింది. ఈ క్రమంలోనే ప్రతినిధుల సభలో కొత్త తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యులు తీసుకురానున్నారు. అయితే, ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలపై నియంత్రణ విధించేందుకు చేసిన ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లో (United States Senate) డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన కీలక తీర్మానం ఓడిపోవడంతో ట్రంప్‌నకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


డెమోక్రాట్ల తీర్మానం ఓటమి..

ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను నియంత్రించాలని డెమోక్రాట్ పార్టీ సభ్యులు సెనేట్‌లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ద్వారా అధ్యక్షుడు తీసుకునే యుద్ధ నిర్ణయాలపై కాంగ్రెస్‌కు అధిక పర్యవేక్షణ హక్కులు ఇవ్వాలని వారు ప్రయత్నించారు. అయితే ఓటింగ్ సమయంలో తీర్మానానికి అవసరమైన మద్దతు లభించకపోవడంతో అది విఫలమైంది. దీంతో ట్రంప్‌పై కాంగ్రెస్ ద్వారా తక్షణ నియంత్రణ విధించే అవకాశం తగ్గింది.


ప్రతినిధుల సభలో కొత్త ప్రయత్నం..

సెనేట్‌లో తీర్మానం ఓడిపోయినప్పటికీ డెమోక్రాట్లు తమ ప్రయత్నాలను ఆపలేదు. యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈ తీర్మానంపై నేడు చర్చ జరిగే అవకాశం ఉందని అమెరికా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.


రిపబ్లికన్ మద్దతు కీలకం..

ట్రంప్ సైనిక చర్యలను నియంత్రించాలంటే డెమోక్రాట్లకు మాత్రమే మెజారిటీ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌‌కు(Republican Party United States) చెందిన కొంతమంది సభ్యులు కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సెనేట్‌లో ఇప్పటికే తీర్మానం ఓడిపోవడంతో హౌస్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.


యుద్ధ నిర్ణయాలపై చట్టపరమైన చర్చ..

ట్రంప్ తీసుకున్న యుద్ధ నిర్ణయాలను కోర్టులో సవాలు చేయవచ్చా అనే అంశంపై అమెరికాలో విస్తృత చర్చ సాగుతోంది. కొందరు న్యాయ నిపుణులు కాంగ్రెస్ అనుమతి లేకుండా చేపట్టిన సైనిక చర్యలపై న్యాయపరమైన పోరాటం జరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


రాజకీయంగా కీలక పరిణామం..

ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. యుద్ధ నిర్ణయాల్లో అధ్యక్షుడి అధికారాలు ఎంతవరకు ఉండాలి? కాంగ్రెస్ పాత్ర ఏమిటి? అనే అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.


సెనేట్‌లో తీర్మానం చర్చ..

సెనేట్‌లో తీర్మానం ఓడిపోవడంతో ట్రంప్‌కు తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో చర్చ జరగబోతున్న తీర్మానం మరోసారి రాజకీయ వేడిని పెంచే అవకాశం ఉంది. అయితే ఆ తీర్మానం కూడా అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ క్షిపణి పరీక్ష

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 01:10 PM