Share News

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:00 AM

కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన కువైట్ భూభాగ జలాల వెలుపల జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. పేలుడు కారణంగా ట్యాంకర్‌లోకి నీరు చేరినట్లు సమాచారం. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి.


భారీ పేలుడు..

సముద్రంలో లంగర్ వేసి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ఎడమ వైపున భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే ఘటనాస్థలం నుంచి ఓ చిన్న పడవ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనకు కారణాలపై యూఏఈ, కువైట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్‌లో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ప్రాణహాని జరగలేదని వెల్లడించారు. అయితే పేలుడు ప్రభావంతో నౌకలోని కార్గో ట్యాంక్ దెబ్బతినడంతో సముద్రంలోకి చమురు లీక్ అవుతున్నట్లు యూఏఈ, కువైట్ అధికారులు గుర్తించారు. కువైట్ సముద్ర తీరంలో కూలిన ఆ ట్యాంకర్ ఇరాన్‌కు సంబంధించినదిగా వార్తలు వస్తున్నాయి. కువైట్, యుఏఈ, శ్రీలంక తీరప్రాంతాలకు ఈ చమురు లీక్ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


సముద్ర పర్యావరణంపై ప్రభావం..

చమురు లీక్ కారణంగా సముద్ర పర్యావరణంపై ప్రభావం పడే అవకాశముందని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర జీవులకు నష్టం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు ఎలా జరిగింది?, తదితర కారణాలపై విచారణ చేస్తున్నారు. చిన్న పడవ ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయిన అంశాన్ని కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం అయినప్పటికీ, చమురు లీక్ కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా రక్షణ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 11:23 AM