గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:35 AM
గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): గద్దర్ సినీ అవార్డులను(Gaddar Film Awards 2026) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గతేడాది ప్రారంభమైన ఈ పురస్కారాల పరంపర, ఈసారి మరిన్ని ప్రతిష్ఠాత్మక విభాగాలతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి 'ఎన్టీఆర్ నేషనల్' అవార్డు ప్రకటించడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలంపాటు నిలిచిపోయిన ప్రభుత్వ పురస్కారాల సంప్రదాయం రేవంత్‌రెడ్డి సర్కార్‌లో మళ్లీ ప్రారంభం కావడంతో కళాకారులకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈసారి ఉగాది రోజున సినీతారల సందడితో ఈ వేడుకను అత్యంత వైభవంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహించనుంది.
విజేతల పూర్తి వివరాలివే..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' రెండో విడత విజేతలను జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో దిగ్గజ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పెద్దపీట వేశారు. ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఎంపికైన ప్రముఖుల జాబితాను ప్రకటించింది. వారి వివరాలివే..
స్పెషల్ అవార్డులు
ఎన్టీఆర్ జాతీయ అవార్డు - చిరంజీవి
రఘుపతి వెంకయ్య అవార్డు - రమేశ్ ప్రసాద్
పైడి జయరాజ్ అవార్డు - కమల్ హాసన్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీదత్
ఏఎన్ఆర్ అవార్డు - జయసుధ
టీఎల్.కాంతారావు అవార్డు - ఆర్.నారాయణ మూర్తి
సి.నారాయణ రెడ్డి అవార్డు - సుద్దాల అశోక్ తేజ
బీఎన్ రెడ్డి అవార్డు - సింగీతం శ్రీనివాసరావు
ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ నటుడు - నాగచైతన్య (తండేల్)
ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అన్ నేషనల్ ఇంటిగ్రేషన్ - తండేల్
ఉత్తమ సందేశాత్మక చిత్రం - కోర్ట్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ నూతన దర్శకుడు - సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ బాలల చిత్రం - అనగనగా
ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు - అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని - సాహితీ చాగంటి (కన్నప్ప)
ఉత్తమ బాలనటుడు - మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - సందీప్ (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - తోటతరణి (ఛాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవిందరాజు (అఖండ -2)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ - పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు
శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేక (ఛాంపియన్)
అనంతిక (8 వసంతాలు)
గద్దర్ అవార్డులపై సినీరంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అవార్డులను మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకలో ప్రదానం చేయనున్నారు. స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డులను ఎంపిక చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ
బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం
Read Latest International News And Telangana News And AP News And Telugu News