ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి.. బీఆర్ఎస్వీ ఆందోళన
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:30 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్వీ విద్యార్థులు, వడ్డెర సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీ దగ్గర మంగళవారం ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల ముట్టడితో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్వీ (BRSV) విద్యార్థులు, వడ్డెర సంఘాల నేతలు ఈరోజు (మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ దగ్గర ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల ముట్టడితో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు.
కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని గతంలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కనికరించడం లేదని ఫైర్ అయ్యారు. సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా కూడా విద్యాసంస్థల మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్వీ విద్యార్థులు ప్రశ్నించారు.
వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి..
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వడ్డెర కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తమకు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని పట్టుబట్టారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి వారు యత్నించారు. అసెంబ్లీ మెట్రోస్టేషన్ వద్ద వడ్డెర సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా తమను అరెస్ట్ చేయడం అన్యాయమని వడ్డెర సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్
బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And International News And Telugu News