అయ్యప్ప దీక్ష చేపట్టే ఉద్యోగులకు అనుమతి ఇవ్వాలి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ లేఖ
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:28 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. అయ్యప్ప దీక్ష చేపట్టే హిందూ పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు సమాన హక్కులు కల్పించాలని కోరారు.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Telangana CM Revanth Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ఈరోజు (సోమవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. అయ్యప్ప దీక్ష చేపట్టే హిందూ పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు సమాన హక్కులు కల్పించాలని కోరారు. స్వామి దీక్ష చేపట్టే పోలీసులు, ఉద్యోగులకు 41 రోజుల దీక్షకు అనుమతి, సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. హిందువుల్లో పెరుగుతున్న భక్తి, ఆధ్యాత్మిక నిబద్ధతకు అయ్యప్ప మాల నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News