Share News

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:41 PM

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
KTR

హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. అప్పు చేసి కేసీఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైందని ఆరోపించారు.


ఒకప్పుడు రూ.కోట్లు పలికిన భూముల ధరలు ఎందుకు పడిపోయాయని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారని సెటైర్లు వేశారు. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్‌ను ఏమనాలి? అని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి 72సార్లు ఢిల్లీ వెళ్లి.. 72పైసలు కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం.. కేటీఆర్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 01:44 PM