Share News

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు... కేటీఆర్ సెటైర్లు

ABN , Publish Date - Jun 24 , 2026 | 01:59 PM

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని.. రెన్యువల్‌ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

రేవంత్‌‌రెడ్డి  రెగ్యులర్‌ సీఎం కాదు... కేటీఆర్ సెటైర్లు
KTR

ఖమ్మం జిల్లా, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని.. రెన్యువల్‌ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సెటైర్లు వేశారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రం ఆగమవుతుందని కేసీఆర్‌ అనాడే చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమితో రాష్ట్రం నష్టపోయిందని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌‌రెడ్డి 72సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) సత్తుపల్లిలో కేటీఆర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏవర్గాన్ని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోందని ధ్వజమెత్తారు.


విలేకర్లకు అన్యాయం చేశారు..

సత్తుపల్లి విలేకర్లకు మండల రిపోర్టర్లుగా అక్రిడిటేషన్ జారీ చేసి రేవంత్‌రెడ్డి సర్కార్ అన్యాయం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కల్లూరు మున్సిపాల్టీ బీఆర్ఎస్ గెలిచేదని.. సత్తుపల్లిలో కూడా స్వల్ప ఓట్లతో ఈ స్థానం చేజార్చుకున్నామని తెలిపారు. ఆయా ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే పార్టీ శ్రేణులు పొంగిపోకూడదని.. ఓడితే కృంగిపోకూడదని పేర్కొన్నారు. తెలంగాణ మారుమూల‌ ప్రాంతాలు ఎక్కడకు వెళ్లినా దుర్మార్గపు కాంగ్రెస్ పాలన పోవాలని.. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ హయాంలోని మొదటి పదేళ్లు పునాది రాళ్లు వేసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ రావాలని ప్రజలే అంటున్నారని తెలిపారు. కేసీఆర్ ఓటములు, గెలుపులు చూశారని.. అనాడు తెలుగుదేశం పార్టీలో అన్నగారితో కలిసి నడిచారని ప్రస్తావించారు. అన్నదాతలకు రైతుబంధు పూర్తిగా చేయకుండా వేధిస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 02:48 PM