Share News

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:40 PM

సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యమంటూనే పేదల ఇళ్లు కూలగొడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు అండగా నిలిచి వాళ్లకు గూడు కట్టిస్తుందని తెలిపారు.

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao

ఖమ్మం జిల్లా, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యమంటూనే పేదల ఇళ్లు కూలగొడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు అండగా నిలిచి వాళ్లకు గూడు కట్టిస్తుందని తెలిపారు. రెవెన్యూ మంత్రి హయాంలో పేదల ఇళ్లు లాక్కోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) ఖమ్మం జిల్లాలో హరీశ్‌రావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం కలెక్టర్‌తో మాట్లాడి పేదల గూడు లాకుంటే ఊరుకోమని చెప్పామని అన్నారు. ఎవరి స్థలాలు అయితే లాక్కున్నారో.. వారికి వెంటనే స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..

ఖమ్మంలో జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే తానే పోరాడుతానని స్పష్టం చేశారు. తాను దగ్గరుండి ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని భరోసా కల్పించారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని అన్నారు. మరి ఖమ్మం జర్నలిస్టులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ఖమ్మం జర్నలిస్టులకు ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని నిలదీశారు.


రేవంత్‌రెడ్డి పాలనంత బ్లాక్‌మెయిల్..

ఖమ్మంలో పేదల ఇళ్లు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని.. ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పి హైడ్రా పెట్టారని ఎద్దేవా చేశారు. ఆయనకు కళ్లు నెత్తికెక్కాయని.. అహంకారాన్ని ప్రదర్శించే వాళ్లే హిట్లర్‌ని ఆదర్శంగా తీసుకుంటారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి పాలనంత బ్లాక్‌మెయిల్ పాలన అయిపోయిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో కనీసం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని దుస్థితి ఉందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్‌ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చలు

కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 01:01 PM