కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:34 PM
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు.
ఢిల్లీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో(Rajnath Singh).. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలో ఈరోజు (సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు రాజ్‌నాథ్ సింగ్‌కు.. సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి తమ ప్రభుత్వం భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్రమంత్రికి తెలిపారు రేవంత్‌రెడ్డి.
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రికి స్పష్టం చేశారు సీఎం. ఆదిలాబాద్‌లో రానున్న భారతీయ వాయుసేన ఎయిర్‌పోర్ట్‌ను భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహకరిస్తామని వివరించారు. భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎమార్వో (MRO), హ్యాంగర్ (HANGER) సౌకర్యాలను పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి.
ఇటీవల పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ తమ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్‌డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News