Share News

ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:30 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద యోగా దినోత్సవంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం  ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు(ఆదివారం) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద యోగా దినోత్సవంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం, స్థానిక యువకులు, ఔత్సాహితులతో కలిసి యోగాసనాలు చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తరుఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.


యోగా అనేది సంప్రదాయంగా ప్రాచీన భారత వ్యవస్థలో, మన జీవన ప్రక్రియలో ఒక అంతర్భాగమని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ యోగాపై ప్రేరణ కలిగే విధంగా హుస్నాబాద్‌లో 12 సూర్య నమస్కారాలతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అందరు కూడా జీవితంలో తప్పనిసరిగా యోగాను ఓ భాగంగా చేసుకొని ఆరోగ్య హుస్నాబాద్, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. యోగా చేయడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 08:40 AM