Share News

ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:02 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లో యోగా దినోత్సవంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
Bandi Sanjay Kumar

కరీంనగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు (ఆదివారం) కరీంనగర్‌లో యోగా దినోత్సవంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదని.. శరీరం, ఆత్మని ఏకం చేసేదే యోగా అని తెలిపారు.


ప్రపంచమంతా భారతదేశాన్ని యోగా భూమిగా గుర్తించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆందోళన, ఒత్తిడితో అతలాకుతలం అవుతోందని తెలిపారు. వైద్యులు కూడా యోగా చేయాలని సూచిస్తున్నారని చెప్పుకొచ్చారు. 177 దేశాలు యోగా అవసరాన్ని గుర్తించాయని వివరించారు. ప్రతిరోజు అరగంటపాటు యోగా చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 09:19 AM