Share News

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:18 AM

బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌రాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Prakash Raj

ఇంటర్నెట్ డెస్క్, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌రాజ్‌కు (Prakash Raj) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాలుగు విభిన్న రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారనే తీవ్రమైన ఆరోపణల కేసులో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.


కేసు నేపథ్యమిదే..

న్యాయవాది కె. దిలీప్ కుమార్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు కోర్టు ఈ చర్యలు చేపట్టింది. ప్రకాశ్‌రాజ్ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఓటరు ఐడీ కార్డులను కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై కోర్టు ఈ విధమైన నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ఇది మూడవసారి.

ఫిబ్రవరి: మొదట కోర్టు ప్రకాశ్‌రాజ్‌కు సమన్లు జారీ చేసింది.

ఏప్రిల్: కోర్టు విచారణకు ఆయన హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

జూన్ 12: అయినప్పటికీ ప్రకాశ్‌రాజ్ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల (జూన్) 12వ తేదీన కోర్టు మూడోసారి వారెంట్‌ జారీ చేసింది.


జులై 25న తదుపరి విచారణ..

న్యాయస్థానం ఆదేశాలను ప్రకాశ్‌రాజ్ పదే పదే బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరవుతుండటాన్ని బెంగళూరు కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను న్యాయస్థానం జులై 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు ప్రకాశ్‌రాజ్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 11:26 AM