మోదీపై.. ఖర్గే ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలు దురదృష్టకరం: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:25 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉగ్రవాది (టెర్రరిస్ట్) అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఖర్గేకు పేరు ఉందని ప్రస్తావించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉగ్రవాది (టెర్రరిస్ట్) అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఖర్గేకు పేరు ఉందని ప్రస్తావించారు. బాధ్యాతాయుతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై.. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. ఖర్గే.. మోదీపై పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం.. ఆ పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని బట్టబయలు చేస్తోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అహోరాత్రులు శ్రమిస్తున్న మోదీని ఉగ్రవాదిగా సంబోధించే ముందు.. ఉగ్రవాదులతో కాంగ్రెస్ నాయకులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే గుర్తుపెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో.. కశ్మీర్ వేర్పాటువాద ఉగ్రవాది యాసిన్ మాలిక్‌తో చర్చలు జరిపిన విషయం ఖర్గేకు గుర్తులేదా..? అని ప్రశ్నించారు. ప్రధానిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. రాజకీయాల్లో మరీముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని.. కానీ ఈ ప్రయత్నంలో వ్యక్తిగత దూషణలకు చోటులేదని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ కావాల్సినంత విషం కక్కారని ఆగ్రహించారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు తమను ద్వేషిస్తున్నారని తెలిసి ఆవేదనతో, ఆక్రోషంతో ప్రధానమంత్రి మీద ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం
నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News