మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం.. భారీ వర్షాలకు హైడ్రా ముందస్తు చర్యలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:43 PM
రానున్న భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. ORR వరకు 889 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రానున్న భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) వ్యాఖ్యానించారు. ORR వరకు 889 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని పేర్కొన్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈరోజు (మంగళవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రంగనాథ్ మాట్లాడారు. 555 మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ బృందాలను సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు.
ఫ్లైఓవర్‌లపై వర్షపునీరు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లీయర్ చేయిస్తున్నామని రంగనాథ్ వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వర్షాల సమయంలో ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కోవడానికి హైడ్రా సిద్ధంగా ఉందని రంగనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News