డిసెంబరులో హైదరాబాద్-రక్సౌల్ మధ్య పలు రైళ్ల రద్దు
ABN , Publish Date - Sep 26 , 2026 | 08:28 AM
సౌత్‌ఈస్ట్రన్ రైల్వేలో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా డిసెంబరులో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: సౌత్‌ఈస్ట్రన్ రైల్వేలో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా డిసెంబరులో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. డిసెంబరు 10న హైదరాబాద్-రక్సౌల్ (17005), 13న రక్సౌల్-హైదరాబాద్ (17006), డిసెంబరు 7,14 తేదీల్లో తిరుపతి-రక్సౌల్(17433), 10, 17తేదీల్లో రక్సౌల్-తిరుపతి (17434) ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. అలాగే, డిసెంబరు 11, 14 తేదీల్లో వాస్కోడిగామా-జాసిద్-వాస్కోడిగామా మధ్య నడిచే 17321/17322 ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News