ఆ 3 రోజులుఏటీఎం చార్జీలు ఉండవు
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:08 AM
బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో నిర్ణయం
28 నుంచి 30 వరకు చార్జీలు రద్దుచేసిన ఎస్‌బీఐ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలను రద్దుచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎస్‌బీఐతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా ఎస్‌బీఐ కార్డులతో నిర్వహించే ఆర్థిక లావాదేవీలపైనా చార్జీలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. 27వ తేదీ ఆదివారం కూడా తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, మొబైల్, ఇంటర్నెట్, వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళ మార్ఫింగ్ ఫొటోలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ.. సీఈసీపై సుప్రీంకోర్టులో పిల్