Share News

మహిళ మార్ఫింగ్ ఫొటోలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:58 PM

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) లీడర్లు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, రత్న సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

మహిళ మార్ఫింగ్ ఫొటోలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఇంటర్‌నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) లీడర్లు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, రత్న సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో తన అనుమతి లేకుండా తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.


అలాగే, ఆ మహిళకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకరమైన లింకులను 24 గంటల్లోపు మెటా నుంచి తొలగించాలని సదరు సంస్థను కూడా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనకూ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆమెకు రక్షణ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. రెండు వారాల్లోపు స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ కె.గిరీశ్ ఆదేశాలు జారీ చేశారు.


మహిళ ఫిర్యాదుతో..

కాగా.. జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన సమయంలో తన ఫొటోను ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌తో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేశారని సదరు మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫొటోను ప్రదర్శనలో భారీ బ్యానర్లపై ప్రదర్శించారని, సోషల్ మీడియాలో ఆ ఇమేజ్ ఉన్న వీడియోను కూడా సర్క్యులేట్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో మొదట గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు సీజేపీ లీడర్ల పేర్లను ప్రస్తావించలేదు.


ఈ వార్తలనూ చదవండి:

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ.. సీఈసీపై సుప్రీంకోర్టులో పిల్

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రెండు వాహనాల ఢీ, ఆరుగురి మృతి

Updated Date - Sep 25 , 2026 | 08:26 PM