ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రెండు వాహనాల ఢీ, ఆరుగురి మృతి
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:05 PM
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలోద్ జిల్లాలోని ఎన్‌హెచ్-30పై మార్కటోలా ఘాట్ సమీపంలో ట్రక్కు, డీజే సిస్టమ్‌తో వెళ్తున్న పికప్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధమతరి-కంకేర్ మధ్య జాతీయ రహదారి 30పై మార్కటోలా ఘాట్ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రక్కు, డీజే సిస్టమ్‌తో వెళ్తున్న పికప్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పికప్ వాహనంతో పాటు అందులోని డీజే పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బలోద్ జిల్లాలోని పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాల వేగం తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు బలోద్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ గోవర్ణ ధృవీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి...
దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం
పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం
Read Latest AP News And Telugu News