Share News

పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం

ABN , Publish Date - Sep 25 , 2026 | 02:47 PM

అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్‌‌ వరుసగా సమావేశాలు అవుతున్నారు. టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో భేటీ అయిన మంత్రి... క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఏపీని ఎంపిక చేసుకోవాలని ఆహ్వానించారు.

పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం
Minister Nara Lokesh

అహ్మదాబాద్, సెప్టెంబర్ 25: అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్‌‌(Minister Nara Lokesh) వరుసగా సమావేశాలు అవుతున్నారు. టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో భేటీ అయిన మంత్రి... క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఏపీని ఎంపిక చేసుకోవాలని ఆహ్వానించారు. ఏపీలో సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు ఏపీని పరిగణించాలన్నారు. 2030 నాటికి 10 గిగావాట్ల రెన్యూవబుల్ సామర్థ్యం లక్ష్యంతో ఇక్కడ పని చేయాలని మంత్రి కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టోరెంట్ చైర్మన్ సమీర్ మెహతా తెలిపారు.


వెల్స్‌పన్ గ్రూప్ సీఈవోతో..

వెల్స్‌పన్ గ్రూప్ సీఈఓ నితిన్ జైన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. కాకినాడలో వెల్స్‌పన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ప్రతిపాదించారు. విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని వెల్స్‌పన్‌కు ఆహ్వానంపలికారు. కాకినాడలో టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, డీఐ పైపుల యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని.. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని నితిన్ జైన్ తెలిపారు.


గోకుల్‌ ఆగ్రో చైర్మన్‌తో భేటీ

గోకుల్ ఆగ్రో చైర్మన్ కనుభాయ్ ఠక్కర్‌తో మంత్రి సమావేశమై.. నెల్లూరులో పామాయిల్, సోయాబీన్ రిఫైనరీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంలో 1,400 టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ నిర్వహిస్తున్నామని.. దక్షిణాది మార్కెట్ల కోసం విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని గోకుల్ ఆగ్రో పేర్కొంది.


టైర్ల తయారీ యూనిట్‌పై చిరిపాల్‌ గ్రూప్‌ ఎండీతో...

అలాగే, చిరిపాల్ గ్రూప్ ఎండీ బ్రిజ్ మోహన్‌తో కూడా మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. విశాఖలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ పెట్టుబడులకు అనుకూలమని చెప్పారు. టైర్ల తయారీ యూనిట్‌పై ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చిరిపాల్ గ్రూప్ హామీ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి...

బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.39 లక్షలకు ప్రణీత్ రెడ్డి సొంతం

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 03:05 PM