Share News

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:49 PM

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడటం కలకలం రేపింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం
Durga Temple Ghat Road

విజయవాడ, సెప్టెంబర్ 25: దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడటం కలకలం రేపింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజుల ముందే దుర్గగుడి ఘాట్‌రోడ్‌ను అధికారులు మూసివేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘాట్‌రోడ్‌కు మరమత్తులు చేసేందుకు రోడ్‌ను మూసివేశారు. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడినప్పటికీ భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆలయ ఈవో శీనా నాయక్... అక్కడకు చేరుకుని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.


మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా

దుర్గగుడి ఘాట్‌‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు, ఆలయ సిబ్బంది భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొండచరియల పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై శాస్త్రీయంగా, సాంకేతికంగా అధ్యయనం చేయించేందుకు బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్(NIRM) నిపుణులను తక్షణమే పిలిపించి ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కూడా NIRM నిపుణులు ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా చర్యలకు సంబంధించి సూచనలు అందించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్

బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.39 లక్షలకు ప్రణీత్ రెడ్డి సొంతం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 01:37 PM