గార్వి షరీఫ్ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:30 AM
లోకంలో భిన్న ఆరాధన పద్ధతులు ఎన్ని ఉన్నా అవన్నీ పరమాత్మను చేరే మార్గాలేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. మత విశ్వాసాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ మానవతా సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
వేమూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): లోకంలో భిన్న ఆరాధన పద్ధతులు ఎన్ని ఉన్నా అవన్నీ పరమాత్మను చేరే మార్గాలేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. మత విశ్వాసాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ మానవతా సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో గురువారం సాయంత్రం ‘అతా ఏ బాగ్ ఏ సర్కార్ తాజుల్ ఔలియా దర్బార్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో జరిగిన గార్వీ షరీఫ్ వేడుక ప్రత్యేక ఊరేగింపు మాధవ్ పాల్గొన్నారు. అతా మహ్మద్ నిజాముద్దీన్ బాబా ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం జరిగిన సభలో మాధవ్ మాట్లాడుతూ, అన్ని మతాల విశ్వాసాలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమన్నారు. ప్రధానిమోదీ స్ఫూర్తితో దేశంలో మత సామరస్యం సోదరభావం, పరస్పర గౌరవం మరింతగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...