Share News

మహిళల భద్రతకు ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:03 AM

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎస్పీ పంకజ్‌కు మార్‌ మీనా తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి ఎస్పీగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం
మార్కాపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్‌కుమార్‌ మీనా

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

మార్కాపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్‌కుమార్‌ మీనా

మార్కాపురం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎస్పీ పంకజ్‌కు మార్‌ మీనా తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి ఎస్పీగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యలపై ఎక్కువగా పోలీసులకు ఫిర్యాదులందుతున్నట్టు తెలుసుకున్నానన్నారు. రెవెన్యూ శాఖతో కలిసి వాటి పరిష్క రానికి కృషి చేస్తానని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తానన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మీనాను ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, డీఎస్పీ నాగరాజు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్వారా జిల్లాలో పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. .

Updated Date - Sep 25 , 2026 | 03:03 AM