Share News

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:59 AM

ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్
Ganesh Immersion

హైదరాబాద్, సెప్టెంబర్ 25: గణేశ్ నవరాత్రులలో విశేష పూజలు అందుకుని నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్‌ మహాగణపతిని టస్కర్‌ పైకి చేర్చారు. కాసేపట్లో మహాగణపతి శోభాయాత్ర మొదలుకానుంది. గణనాథుడు వెళ్లే మార్గాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా సీపీ తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన సన్నాహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనకు ముందు అధికారులతో కలిసి బడా గణేశుడికి సజ్జనార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇక, బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగేలా చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి తదితర శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. బందోబస్తు కోసం దాదాపు 20,000 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లోకి దించామన్నారు. శోభాయాత్ర మార్గాల్లోని 10,000 సీసీ కెమెరాలను టీజీఐసీసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. మహిళలు, యువతుల భద్రత కోసం మూడు షిఫ్టుల్లో 26 'షీ-టీమ్స్' బృందాలు పనిచేయనున్నాయని తెలిపారు. ట్రాఫిక్ విభాగం జారీ చేసే మార్గదర్శకాలను గమనించి ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పండుగను శాంతియుత, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సీపీ సజ్జనర్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

హోంగార్డుగా మానేసి.. బంగారం షాపు పెట్టి

గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 10:07 AM