ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:22 AM
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు. డీజే వాడకుండా.. సన్నాయి మేళాల మధ్యనే ఖైరతాబాద్ లంబోదరుడిని నిమజ్జనం చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ - 5 దగ్గర బడా గణేశ్‌ను నిమజ్జనం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
నిన్న (గురువారం) రాత్రి 8 గంటలకు గణేశ్‌కు ఉత్సవ కమిటీ సభ్యులు చివరిపూజ నిర్వహించారు. బడా గణపతి శోభాయాత్రకు విజయవాడ నుంచి భారీ టస్కర్‌ను తీసుకువచ్చారు. గణేశ్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో శోభాయాత్రకు ఆలస్యమైంది. సాంకేతిక లోపాన్ని పరిష్కరించి గణేశ్‌ను టస్కర్ పైకి చేర్చారు. ఏకదంతుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
కాగా, హైదరాబాద్ తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ వద్ద భక్తుల సందడి నెలకొంది. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి భారీగా గణనాథులు చేరుకుంటున్నారు. వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు భారీగా వస్తోండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సచివాలయం సౌత్, ఈస్ట్ గేట్ ముందు నుంచి నిమజ్జనానికి ఖైరతాబాద్ బడా గణనాథుడు రానున్నారు. గణేశ్ వెళ్లే రూట్‌ను పోలీసులు బ్లాక్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ
ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News