గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:30 AM
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు భక్తులు కూడా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు భక్తులు కూడా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశారు. ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఖైరతాబాద్, లక్డీకాపుల్, అసెంబ్లీ స్టేషన్‌లలో రద్దీ నియంత్రణకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, ఫలక్‌నుమా, లింగంపల్లి మార్గాల్లో అదనపు ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి 700 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు నడిచేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ల కోసం పోలీస్ కంట్రోల్ రూంలు, 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్ల నియామించారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీస్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరాపార్క్, వి.వి.విగ్రహం వద్ద ఆర్టీసీ రిలీఫ్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, AIR వద్ద ఆర్టీసీ ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు. అవాంతరాలు లేకుండా బస్సులకు అత్యవసరంగా మరమ్మతులు చేయడానికి పోలీసు స్టేషన్ల వద్ద 113 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లను అందుబాటులో ఉంచారు.
ఇవి కూడా చదవండి...
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..
హోంగార్డుగా మానేసి.. బంగారం షాపు పెట్టి
Read Latest Telangana News And Telugu News