కుళ్లిన కూరగాయలు, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:13 AM
ఆహార కల్తీ, నాణ్యతపై దృష్టి సారించిన టీజీ సేఫ్ అధికారులు గురువారం నగరంలో పలు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు.
పలు హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీసేఫ్ దాడులు
హైదరాబాద్ సిటీ: ఆహార కల్తీ, నాణ్యతపై దృష్టి సారించిన టీజీ సేఫ్ అధికారులు గురువారం నగరంలో పలు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్ల కిచెన్‌లలో అపరిశుభ్రవాతావరణం, డ్రైనేజీ, దోమలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అపరిశుభ్రవాతావరణంలో ఆహార పదార్థాలు నిల్వ చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు.
గచ్చిబౌలిలోని గర్ల్‌ఫ్రెండ్ మందీ, గోపనపల్లిలో శ్రీకృష్ణ ఫ్యామిలీ దాబా, పుప్పాలగూడలోని నెక్సార్ హోలిఫిష్ ఫుడ్స్, ఆస్పీ హాస్పిటాలిటీ, సీజన్స్ ఎక్స్‌ప్రెస్, సాయిమెస్, లక్కీ రెస్టారెంట్, గోదావరి ఘుమఘుమలు, యమ్మీబీ, ఆదిత్య రెస్టారెంట్, ఈట్ క్లబ్, జేఎంజే రెడ్డీస్ హాస్టల్, వెష్ణవి దర్శిని, స్పైసీ హబ్, పక్వాన్ గ్రాండ్‌లపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. నిబంధనలు పాటించని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News