Share News

జగిత్యాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:12 AM

జగిత్యాల జిల్లాలోని తులసినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడి మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. గుండెపోటుతో జయంత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

జగిత్యాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి
Jagtial News

జగిత్యాల, సెప్టెంబర్ 25: జిల్లాలోని తులసినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడి మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. గుండెపోటుతో జయంత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిత్రులతో కలిసి డ్యాన్స్‌ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తులసినగర్‌కు చెందిన 24 ఏళ్ల తోపారపు జయంత్‌ ప్యాడ్ బ్యాండ్ సౌండ్స్‌కు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా.. కొద్దిసేపటికే యువకుడు కుప్పకూలాడు. అక్కడే ఉన్న పోలీసులు సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటనాస్థలంలోనే యువకుడికి సీపీఆర్ చేశారు.


యువకుడు పడిపోయిన వెంటనే 108కు స్థానికులు సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. అంతకంతకూ యువకుడి పరిస్థితి విషమించడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అంబులెన్స్ స్పందించకపోయినప్పటికీ పోలీస్ వాహనంలోనే జయంత్‌ను ఆస్పత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించి వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి వరకు తమతో కలిసి డ్యాన్స్ చేసిన మిత్రుడు విగతజీవిగా మారడంతో తోటి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.


ఇవి కూడా చదవండి...

గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 11:58 AM