Share News

ఖాజాగూడ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:58 AM

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఖాజాగూడ జంక్షన్‌ వద్ద నీటి పైపులైను పనులు చేపడుతుండటంతో పనులు సజావుగా కొనసాగేందుకు తాత్కాలికంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ

ఖాజాగూడ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు
Traffic Diversion

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఖాజాగూడ జంక్షన్‌ వద్ద నీటి పైపులైను పనులు చేపడుతుండటంతో పనులు సజావుగా కొనసాగేందుకు తాత్కాలికంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈనెల 26నుంచి 60రోజుల పాటు ఖాజాగూడ జంక్షన్‌ వద్ద కిమ్స్‌ ఆస్పత్రివైపు నుంచి నానక్‌రాంగూడ రోడ్డువైపు వెళ్లే సర్వీస్‌ రోడ్‌, ఫ్రీలెఫ్ట్‌, బయోడైవర్సిటీ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ రోడ్డు వైపు వచ్చే వాహనాలు రైట్‌ టర్న్‌ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు.


city5.2.jpgప్రత్యామ్నాయ మార్గాలు

షేక్‌పేట ఫ్లైఓవర్‌ నుంచి ఖాజాగూడ వైపు వచ్చే వాహనాలు కిమ్స్‌ ఆస్పత్రికి ముందు టింబర్‌లేక్‌ కాలనీ రోడ్డు ద్వారా మళ్లించి, నానక్‌రామ్‌గూడ రోడ్‌కు చేరుకోవాలి. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ లెవల్‌-1 ప్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు పక్వాన్‌ యూటర్న్‌ వద్ద మళ్లించి ఖాజాగూడ లేక్‌ రోడ్‌ మీదుగా ఖాజాగూడ వైపు వెళ్లవచ్చు.

- సాధారణ ప్రయాణికులు.. ఐటీ ఉద్యోగులు, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి తమ ప్రయాణాన్ని ముందే ప్లాన్‌ చేసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 09:58 AM